Header Banner

విశాఖ ప్రజలకు ఊరట! ఇక అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్! జూన్ 1 నుంచి ప్రారంభం!

  Tue May 06, 2025 12:31        Others

ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రయాణిస్తున్న వారికి రైలు మార్గాలు, అన్ని రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి విజయవాడ, తిరుపతికి వెళ్ళడానికి రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. తప్ప ఆకాశం మార్గం అదేనండి ఎయిర్పోర్ట్లు ఉన్నా విమానాలు అందుబాటులో లేవు. ఆకాశమార్గం మాత్రం నేరుగా లేని కారణంగా చాలా వరకు విజయవాడకు గానీ, తిరుపతికి గానీ, ఇతర ప్రాంతాలకు గానీ నేరుగా ఫ్లైట్లు లేవు. అంటే విమాన సర్వీసుల రాకపోకలు అనేది కష్టతరంగా మారుతోంది.

 

ఇది కూడా చదవండిఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాలన్నా.. మొన్నటి దాకా హైదరాబాద్ వెళ్లి మళ్లీ విజయవాడ రావాల్సి వచ్చేది. దీని వల్ల ప్రయాణం సంగతి సరేసరి. అటు సమయం కూడా వృధా అవుతుందని గతంలో గంటా శ్రీనివాసరావు, అలాగే విష్ణుకుమార్ రాజు లాంటి టిడిపి, బిజెపి పెద్దలు వాపోయారు. విశాఖకు, విజయవాడకు వెళ్లాలి అంటే డైరెక్టుగా ఫ్లైట్స్ లేకపోవడం.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ రాకపోవడం చాలా ఇబ్బందికరమని ఇదివరకు అందరూ కూడా బాధపడ్డారు. ఇక ఆ ఇబ్బంది లేకుండా చేశామని, ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ, శ్రీకాకుళం ఎంపీ అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెబుతున్నారు.

 

జూన్ 1 నుండి విశాఖపట్నం-విజయవాడ మార్నింగ్ ఫ్లైట్ సర్వీస్ పునఃప్రారంభిస్తామని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. సత్వర మద్దతు ఇచ్చిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 1 నుండి విశాఖపట్నం, విజయవాడ మధ్య ఇండిగో మార్నింగ్ ఫ్లైట్ సర్వీస్ పునఃప్రారంభం కావడం పై విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో రద్దు చేసిన ఈ సర్వీస్ ఇప్పుడు ప్రజలకు, వ్యాపార వర్గాలకు సేవ చేయడానికి పునరుద్ధరించామని తెలిపారు. ఈ సమస్యపై త్వరగా స్పందించి, ఈ ముఖ్యమైన ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పునరుద్ధరణకు దోహదపడినందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుకు ఎంపీ శ్రీ భరత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇది కూడా చదవండిటీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VisakhapatnamToVijayawada #APFlights #MorningFlightService #DirectFlightAP #FlightConnectivity #IndiGoReturns